నిన్ను పూర్తిగా నా సొంతం
చేసుకుందామనుకుంటాను
అందుకోసం
కుటిలనీతిని అందుకోవాలో
బుద్ధిహీనత దాచుకోవాలో
అబద్ధాల మూటను అందుకోవాలో
ఇంకా నిర్ణయించుకోలేదు
ఏది ఏమైనా
మంత్రాలను తంత్రాలను
అసూయ ద్వేషాలను
గుంపుగా చేసి
యుద్ధభేరి మ్రోగించాలనుకుంటా
అయినా
మతి గతి తప్పడం ఏమిటో
మది వంత పాడడం ఏమిటో
నాలో ఉన్న నీతో పంతం ఎందుకో
సొంతం అనే ఆధిపత్యపు పోరు ఎందుకో
ఏమి చేయను..
మదిని ఒప్పించలేక నొప్పించలేక
తప్పు చేశాననే తలపు తనువంత
నీ నుంచి తప్పుకుని పోవాలని ఉంది
అందుకే ఈవేళ
నిదుర లేని మది
నిను మరచిపోవాలని
చిక్కుముడులు వేసుకుంటుంది
ఓయ్ .......
తన తప్పేమీ లేదంటూ.. నచ్చచెప్పి
నిదురబుచ్చి పోరాదు